Nov 09,2023 00:38
నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి-కనిగిరి: వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తూ.. సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేపట్టడం సిగ్గుచేటని జిల్లా ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి యద్దనపూడి సలోమాన్‌ రాజు అన్నారు. బుధవారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షు డు బుల్లా బాలబాబు ఆధ్వర్యంలో అమరావతి గ్రౌండ్లో దళిత నాయకుల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా సలోమాన్‌ రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభు త్వం దళితులకు ఏమి మేలు చేసిందని ప్రశ్నించారు. బుల్లా బాలాబాబు మాట్లాడుతూ దళితుల నోట్లో మూత్రం పోస్తే దళితుల మంత్రులు గాని, నా ఎస్సీలు అంటున్న సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఖండించకపోవటం సిగ్గుచేటు అన్నారు. గోన ప్రతాప్‌ మాట్లాడుతూ టిడిపి హయాంలో 27 సంక్షేమ అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో 27 సంక్షేమ పథకాలను రద్దు చేయటం దారుణ మన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్య పేరును తీసివేసి జగన్మోహన్‌రెడ్డి పేరును పెట్టుకోవటం ఎంతవరకు సబబని అన్నారు. ఓటు వేసిన పాపానికి దళితులను హత్య చేయడం, అత్యాచారాలకు పాల్పడడం, వారి భూములను ఆక్రమించు కోవడం చేస్తూ నిరంతరం దళితులను చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని విజయ యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. దళితుల ఉసురుపోసుకుంటున్న వైసిపి నాయకులకు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు హక్కు లేదని నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో దళిత నాయకులు బలసాని కోటయ్య, కుంచం జక్రయ్య, ఏసురత్నం, గోన వెంకటయ్య, గోన బర్ణబాసు, జాన్సన్‌, ఎర్రయ్య, మురహరి నరసయ్య, శ్యాంసన్‌, దశరథ, ప్రభుదాసు, మధుబాబు, ఆలీసు, కరాటపు మోజెస్‌, బ్రాక్‌, ఏబినేజర్‌, షడ్రక్‌, లూకా, గోన దేవ, శ్రీహరి, నారాయణ పాల్గొన్నారు.