Aug 15,2023 23:25

దళితులపై దాడులు అరికట్టాలి
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌: దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపో తున్నాయని... దాడులు అరికట్టాలని కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా నాయకులు వెంకటేశులు, దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నందయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళితులకు తితిదేలో ఈవోగా, ఛైర్మన్‌గా దళితులకు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదన్నారు. ఇప్పటికైనా దళితులకు అన్ని అవకాశాలు కల్పించా లని, దళితులపై దాడులను అరికట్టాలని.. కుల వివక్షను విడనాడా లని అన్నారు. లేనిపక్షంలో అన్ని దళిత సంఘాలతో ఆందోళన నిర్వ హిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం, వెంకటేష్‌, రామలింగం, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.