Jun 11,2023 17:54

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి మహేష్‌

దళితులపై దాడులను అరికట్టాలి : డిహెచ్‌పిఎస్‌

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌

ఎస్‌సి ఎస్‌టిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిహెచ్‌పిఎస్‌ జిల్లా కార్యదర్శి సి. మహేష్‌ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయం నందు దళిత హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం ఓంకార స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిహెచ్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మహేష్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్‌ యాదవ్‌, రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం.గోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చి 9సంవత్సరాల అవుతున్న దళితులు ఏమాత్రం బాగా పడలేదని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని, దళితుల అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు బడ్జెట్‌లో కేటాయించిన ఆ నిధులు దళితుల అభ్యున్నతికి ఖర్చు చేయకుండా ఇతర వాటికి అనగా నవరత్నాలకు, ఇతర సంక్షేమ పథకాలకు మళ్లింపు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రచ్చుమర్రి గ్రామంలో దళితుల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని వారు ప్రభుత్వంను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, నాగరాజు, ఉలిగయ్యా, తిక్కయా, మారెప్ప తదితరులు పాల్గొన్నారు.