ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని కోరుతూ త్వరలో భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. సోమవారం కాస్మోపాలిటన్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం దళితులకు పథకాలను రద్దు చేసిందని, ఆ పార్టీలో దళితులకు స్థానం లేకపోగా ఉన్న వారిని అవమానాల పాలు చేస్తోందన్నారు. దళితుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎంఎల్‌సి అనంత బాబు బెయిల్ రద్దు చేసి జైల్లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జి, ఆర్‌పిఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్, సిపిఐ నాయకుడు తోకల ప్రసాద్, టిడిపి మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కొండ్రు మురళి, అధికార ప్రతినిధి రాజేష్, మాజీ ఎంఎల్‌ఎలు వనమాడి వెంకటేశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ, మోకా ఆనంద సాగర్, కాశి నవీన్ కుమార్, తలారి వెంకటరాజు, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, పప్పు దుర్గా రమేష్, చొల్లంగి వేణుగోపాల్, నక్కా ఆనంద్ బాబు, కెఎస్.జవహర్, సిపిఐ నాయకులు తాటిపాక మధు, జనసేన నేత పిట్టా జానకి రామారావు, బట్టు లీల, బండి సుజాత, బోడపాటి మరియ పాల్గొన్నారు.










