మాట్లాడుతున్న కెవిపిఎస్ నాయకులు
ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్: మాకవరపాలెం మండలం జి.నగరంలో ఈనెల 16న జరిగిన సంఘటనలో దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని కెవిపిఎస్ డిమాండ్ చేసింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ.చిరంజీవి, నర్సీపట్నం డివిజన్ అధ్యక్షులు లోవరాజు మాట్లాడుతూ, దళితులు, బీసీల మధ్య గొడవ జరిగినప్పుడు దళితులను మాత్రమే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసిన దళితులను వెంటనే విడుదల చేయాలన్నారు. దాడి చేసిన వారిపై తక్షణమే అరెస్టు చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని తెలిపారు.










