దళితులపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
ప్రజాశక్తి-బాలాయపల్లి : మండలంలోని అంబలపూడి గ్రామంలోని ప్రభుత్వ భూమిని గత పదేళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు దళితులు సాగు చేసుకుంటున్నారు. సోమవారం గుండాల పణి తాను సాగు చేసుకుంటున్న వ్యవసాయ పొలంలో జేసీబీతో చదును చేస్తుండగా అదే గ్రామానికి చెందిన అశోక్ కత్తులతో దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. మంగళవారం వ్యవసాయ రైతు కూలీ సంఘం, కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పోలీసులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రైతు కూలి సంఘం నాయకుడు జోగి శివకుమార్, కుల వివక్ష పోరాట సమితి నాయకుడు అడపాల ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ భూమిని భూమిలేని పేదల సాగు చేసుకుంటే ఇలా దాడి చేస్తారా అని ఆరోపించారు. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూమిని అశోక్‌కు ఎలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సాగు చేసుకున్న భూమికి భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో కులవివక్ష పోరాట సమితి నాయకులు సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.










