Nov 01,2023 23:38

ప్రజాశక్తి-కాకినాడ తిరుమాలిలో దళితులపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. బుధవారం జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న దొమ్మేటి నేరిబాబును సామాజిక న్యాయ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ వి.మహిపాల్‌ వి.సోమశేఖర్‌, బి.ఆంజనేయులు, సిఐటియు రూరల్‌ మండల నాయకులు టి.రాజాతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం ఏలేశ్వరం ఎస్‌ను ఫోన్‌లో దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టామరి, డిఎస్‌పి విచారణ చేస్తారని ఎస్‌ఐ తెలిపారు. అగ్రకులస్తుడైన కోరుకొండ శివ మరికొంతమంది దళితపేటపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టుగా విపరీతంగా కొట్టారని వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమాలి గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాలని సామాజిక న్యాయ సాధన సమితి నాయకులు తీర్మానించారు.