
దళితులపై చిన్న చూపు..
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైసిపి ప్రభుత్వం దళితులపై చిన్నచూపు చూస్తోందని కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పున్నూరు గ్రామంలో జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి అడుగు ప్రజల కోసమే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూన్నూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ, పూలతో ఆహ్వానిస్తూ బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని అన్ని గృహాలకు వెళ్లి తమ ప్రభుత్వం అవలంభించబోయే పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన నాలుగున్నర సంవత్సరకాలంలో 600మందికి పైగా దళితులపై దాడులు జరిగాయన్నారు. ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవన్నారు. ఏ దళిత మంత్రి అయినా ఎంఎల్‌ఎ అయినా ప్రశ్నించిన దాఖలలు లేవన్నారు. 28మంది దళితులు అన్యాయంగా చనిపోయారన్నారని, వాటికి పరోక్షంగా వైసిపి నాయకులే దళితుల చావుకు కారణమన్నారు. జిల్లాలో కావలికి సంబంధించి కరుణాకర్ అనే దళితుతుడును, రూరల్‌కు సంబంధించి నారాయణను, ఉదయగిరికి సంబంధించి ఒక దళిత మహిళను సాంఘిక అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. వైసిపి ప్రభుత్వానికి ఎన్నికల సమయానికే అనగారిన వర్గాలు గుర్తొస్తారు తప్ప మిగతా సమయంలో వారిని పట్టించుకోరన్నారు. గతంలో ఉన్న ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు ఎందుకు దళితులకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటూ ఎప్పుడు దళితులకు అండగా ఉంటుందని గతంలో దళితులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, జిల్లా దళితనేత దారా విజరు కుమార్, పున్నూరు నాయకులు వేణు, సుమన్, ముంగర కృష్ణ, ఈదురు చెన్నయ్య, గంపల అనిల్ తదితరులు పాల్గొన్నారు.