ప్రజాశక్తి- వేపగుంట : దళితులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎపిఇపిడిసిఎల్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జోనల్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ 95వ వార్డు కష్ణరాయపురం దరి శ్రామికనగర్‌లో సుమారు 50 పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన దళితులకు కొన్నాళ్లుగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి, బిల్లులు ఇవ్వలేదని, దీంతో వారూ బిల్లులు చెల్లించలేదన్నారు. ఇపుడు ఒక్కసారిగా పూర్వ బిల్లు బకాయిలతో కలిసి ఒక్కొక్కరికీ వేలల్లో చెల్లించాలని విద్యుత్‌శాఖ అధికారులు బిల్లులు ఇవ్వడంతో పాటు చెల్లించలేదంటూ కొందరి కనెక్షన్లు తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, దళితులకు గతంలో మాదిరిగా ఉచిత విద్యుత్ అమలుచేసి, బిల్లు బకాయిలు రద్దు చేయాలని కోరారు. విద్యుత్ అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సింహాచలం, సిఐటియు నాయకులు అప్పలనాయుడు కాలనీవాసులు పాల్గొన్నారు










