దళితులకు భూములు చూపండి
కలెక్టర్ ను కలిసిన బాధితులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు..
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మిడ్తూరు మండలం లోని పేద దళితులకు అనేక ఏళ్ల కిందట పట్టాలు ఇచ్చారని కానీ ఇంత వరకు భూములు చూపించలేదని కింది స్థాయి అధికారులను కలిసిన స్పందన లేదని బాధితులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం. నాగేశ్వరావు, సుధాకర్,మిడుతూరు మండల అధ్యక్షుడు టి ఓబులేష్ గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. సోమవారం ఇచ్చిన పట్టాలకు భూములు చూపించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టాలు ఇచ్చిన దళితులకు భూములు చూపాలని, 1996లో మిడుతూరు మండలం కేంద్రంలోని 40 కుటుంబాలు దళితులు, ఆరు బీసీ కుటుంబాలకు అలగనూరు గ్రామం పోలిమేర లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని వాటిపై బ్యాంకులో సొసైటీలో క్రాప్ లోను మరియు సబ్సిడీ ద్వారా విత్తనాలు ఎరువులు తెచ్చుకోవడం జరిగిందని 27 సంవత్సరాల నుండి పట్టా పాస్ పుస్తకాలకు భూములు చూపాలని వచ్చిన ప్రతి తాసిల్దారును, ఆర్డీవోను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అడుగుతున్న మాటలతో కాలయాపన చేస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ,స్పందించిన కలెక్టర్ సమస్యలు పరిస్కారానికి కృషి చేయాలని డి ఆర్ ఓను ఆదేశించారు. తాసిల్దారు తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో సుజ్ఞానం జయరాముడు ఏసన్న తిరుపాలు సుంకన్న మద్దమ్మ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు










