Mar 18,2023 23:05

ప్రజాశక్తి-నందిగామ : దళితుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌ లో 26 వేల కోట్లు కేటాయించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రియా మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. నందిగామ సుందరయ్య భవన్‌ లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జనభా ప్రాతిపదికన నిధులు కేటాయించకుండా, 20 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ వివరణ ఉంది తప్ప అంకెలేవన్నారు. దళితులకు కేటాయించాల్సిన సంక్షేమ పధకాలు నవరత్నాల ఖర్చు చూపించటం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సి, ఎస్టి సబ్‌ ప్లాన్‌ నిధులు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత వాడలలో మౌళిక సదుపాయాలు,భూమి కొనుగోలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ,నిందితులను కాపాడుతూ దళితుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలు రకాల సమస్యలపై మార్చి 23న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరసనను దళితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.