
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్క రించాలని సిపిఎం, కెవిపిఎస్, వ్య.కా.స, మాల మహానాడు ఐక్యవేదిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళితులు ఎదుర్కొంటున్న సమస్య లపై డిసెంబర్ 4వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పిం చేందుకుపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురు వారం పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంద ర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉపప్ర ణాళిక చట్టం ప్రకారం బడ్జెట్లో పక్కదారి మళ్లించిన నిధులను తిరిగి కేటా యించాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు కేసులు విచారిం చడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, కోనేరు రంగారావు సిఫార్సులు అమలు చేయాలని, భూస్వాముల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని, అసైన్డ్ చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షలు కోట్లు కేటాయించాలని, జస్టిస్ పున్నయ్య సిఫార్సులు అమలు చేయాలని, కుల వివక్ష, అంటరానితనంపై ప్రభుత్వమే ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. శ్మశానాలు లేని దళిత గ్రామాలకు స్థలం కేటాయించాలని, డప్పు కళాకారులు, చర్మకా రులకు రూ.5 వేలు పెన్షన్ పెంచి 45 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. అర్హులైన దళిత కుటుంబానికి రెండు సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు రెండు ఎకరాల సాగు భూమిని కేటా యించి పక్కా గహ నిర్మాణానికి రూ.5 లక్షలు పెంచాలని తెలిపారు. శ్మశా నాలలో పనులు చేస్తున్న కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బిజెపి మతోన్మాద శక్తులు, మనువాద కుట్రలను తిప్పికొ ట్టాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జయరామయ్య, పందికాళ్ళ మణి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచల య్య, ఇండియన్ లేబర్ పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా నాయకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.