ప్రజాశక్తి -పాయకరావుపేట: దళితులపై దాడులను నిరసిస్తూ పాయకరావుపేట చిత్ర మందిర్ థియేటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్ ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరంతరం దళితుల పైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. తొండంగి మండలం. శంఘవక్షం గ్రామంలో దళిత యువకుడు రాము ను ా చంపారన్నారు. ఈ కేసులోని నిందుతులను రక్షించడానికి అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందరని ఆరోపించారు.ఈ కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, పార్టీ కాకినాడ జిల్లా ఇంచార్జ్ రాజాల నాగేశ్వరావు, మాల మహానాడు తుని అసెంబ్లీ కో. ఆర్డినేటర్ మార్తి సింహాచలం, స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ పెదపాటి నూకరాజు, ఎస్సీ. ఎస్టీ. బీసీ. మైనార్టీ సంఘాల ఐక్య వేదిక తుని మండలం శాఖ అధ్యక్షులు ఈలపు. నాగబాబు, .ఐక్య వేదిక మండలం కన్వీనర్ తాటిపర్తి అప్పారావు యాదవ్ పాల్గొన్నారు.










