నిరసన తెలుపుతున్న దళితులు
ప్రజాశక్తి -తగరపువలస : ఇటీవల రాజస్తాన్‌లో కుండలో నీటిని తాగాడని ఉపాధ్యాయుడు దాడి చేయడంతో దళిత విద్యార్థి మృతిచెందిన ఘటనను ఖండిస్తూ భీమిలి మండలం తాళ్ళవలస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత, ఆదివాసీ సంఘాల మండల కన్వీనర్ బోని ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ, ఈ తరహా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్, గౌరీ శంకర్, వాసు, మామిడి భాస్కరరావు, బోని నరసింగరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.










