Sep 14,2023 23:12

- కెవిపియస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణాచలం

దళితుల హక్కుల రక్షణ కోసం
29న మహా ధర్నా ను జయప్రదం చేయండి
- కెవిపియస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణాచలం
ప్రజాశక్తి -సత్యవేడు: దేశ వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌ తో గల్లీ నుండి ఢిల్లీ దాకా దళితులను చైతన్యం చేయడం లో భాగంగా కెవిపియస్‌ నాయకత్వాన దళిత రక్షణ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని కెవిపియస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి అరుణాచలం గురువారం తెలిపారు. కెవిపియస్‌ నిర్వహిస్తున్న దళిత రక్షణ యాత్ర లో భాగంగా జిల్లా లోని అన్ని మండల్లాలోని ఎస్సీ కాలనీల నుండి పాదయాత్ర, రౌండు టేబుల్‌ సమావేశం, కరపత్రాలు పంపిణీ చేసి దళితులను చైతన్య పరుస్తామని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి మతోన్మాద విధానాలతో మనువాదాన్ని తిరగదోడి దళితులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగానే అభివద్ధి మాటను పక్కన పెట్టిన బిజెపి, కులం, మతం, సంప్రదాయం పేరుతో, తినే తిండి పేరుతో వైషమ్యాలను సష్టిస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోందన్నారు. ఆధిపత్య వర్గాల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా వారిని కనీసం పోలీస్‌ స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కనివ్వకుండా అధికార మదంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రతిపక్ష సహకారం దొరుకుతోందేమో అని ఎదురుచూస్తున్న దళితులకు, పాలనకు సంబంధించి తామూ ఆ తానులోని గుడ్డలమే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పెరిగిపోతున్న ఈ ఆర్థిక, సామాజిక అంతరాలను బద్దలు కొట్టే విధంగా దళితులంతా ఒక్కటై ఐక్యంగా ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సెప్టెంబర్‌ 29న విజయవా డలో జరిగే మహా ధర్నా ద్వారా దళిత శక్తి ఏంటో చూపాలని వారు పిలుపు నిచ్చారు. దళిత రక్షణ పాదయాత్ర లో దళితు లు నిరంతరం ఎదుర్కొనే సమస్య లే ప్రధాన అజెండా గా ఉంటుందని, దళిత సంఘా లు అంబేద్కర్‌ సంఘా లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.