దళితుల భూములు లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధం- సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
గోపవరం : మండలంలోని మడకలవారిపల్లె దళితులకు చెందిన జడ్‌హెచ్‌డిసి భూములను ప్రభుత్వం లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం దళితుల భూములను సిపిఎం ఆధ్వ ర్యంలో ప్రజా సంఘాల నాయకులు పరిశీలిం చారు. బాధితులతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1972లో ఇచ్చిన భూములు, ముందస్తు నోటీ సులు ఇవ్వకుండా, దళితుల నుంచి ఎన్‌ఒసి తీసుకోకుండా, నష్టపరిహారం చెల్లించకుండా, ప్రత్యామ్నాయ భూములు చూపించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం దళితుల భూములు రద్దుచేసి స్వాధీనపరుచుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. బాధితు లతో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో, అఖిలపక్ష పార్టీల నాయకులను చర్చలకు పిలవాలని డి మాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాసులు, బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రమణ, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పి.చాంద్‌బాషా, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని, వ్య.కా.స జిల్లా ఉపాధ్యక్షులు డి.వెంకటేష్, మహిళా సంఘం నాయకులు రత్నమ్మ, సావిత్రి, అనంతమ్మ, వత్తిదారుల సంఘం నాయకులు రమణ, సిఐటియు నాయకులు నాగేంద్రబాబు, ఆవాజ్ బద్వేల్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సత్తారు, అన్వర్ పాల్గొన్నారు.
భూములు జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించొద్దు
కడప అర్బన్: మడకవారిపల్లెకు చెందిన దళితులకు చెందిన జడ్‌హెచ్‌డిసి కింద ఇచ్చిన 60 ఎకరాలను జగనన్న స్మార్ట్ సిటీకి ప్రభుత్వం కేటాయించడం సరైనది కాదని భూ పోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ బి.నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్ తెలిపారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జడ్‌హెచ్‌డిసి భూములు ఉమ్మడి జిల్లాలో 15 మండలాలలో ఐదువేల ఎకరాలు దళితులకు 40 ఏళ్ల క్రితం కేటాయించినారని పేర్కొన్నారు. వారి భూములకు అభివద్ధికి నిధులు కేటాయిం చలేదని తెలిపారు. వారే సొంతంగా భూము లను సాగులోకి తెచ్చుకోవడం, పంటలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ప్రభు త్వం డికెటి భూములకు సన్నకారు, చిన్న కారు రైతులకు ఇస్తున్నట్లు రైతు భరోసా పంట నష్టపరిహారం, ఇతర సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం లాంటి హక్కులు కల్పించకపోవడం వల్ల దళిత రైతులు ప్రతి సంవత్సరం పంటలు సకాలంలో పండక పోవడం వల్ల నష్టపో తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపసంహ రించుకోవాలని కోరారు. లేనియెడల దళితుల పక్షాన భూ పోరాట సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఇతర దళిత, గిరిజన, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.










