ప్రజాశక్తి - ఆదోని
దళితుల ఐక్యతను చాటుదామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ వీరేష్ తెలిపారు. దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుల స్ఫూర్తితోనే ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాలని కోరారు. బసవ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించే సామూహిక వివాహాలతో దళితుల ఐక్యతను చాటుదామని తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయులైన డాక్టర్ బిఆర్.అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మానవతావాది బసవేశ్వరుడి జయంత్యుత్సవాల సందర్భంగా వారి స్ఫూర్తితో సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి దళిత కుటుంబం నుంచి వివాహానికి తరలిరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ జిఎస్‌టి కమిషనర్ నాగరాజు, జాతీయ మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దళిత నాయకులు ఎం.నాగరాజు, కోడ్లే మల్లికార్జున పాటు పలువురు హాజరవుతారని తెలిపారు. నాయకులు లోకేష్, విజరు, బాలస్వామి, మణికంఠ, విజరు, సురేష్, సంజీవ్, గిరిమల్లప్ప, ఆనంద్, ఈరన్న, వంశీ, మణి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నిర్వాహకుడు వీరేష్










