ప్రజాశక్తి -భీమునిపట్నం: మండలంలోని అమనాంలో దళిత యువకుడు సారిక సాయిగణేష్ మోటారు బైక్‌ను తగులబెట్టిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ భీమ్‌సేన్ వార్ ఆధ్వర్యంలో బుధ వారం స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట దళితులు ఆందోళన చేశారు.ఈ సందర్భంగా భీమ్‌సేన్ వార్ ప్రధాన సలహాదారు ఎస్‌ఆర్ వేమన మాట్లాడుతూ, దళిత యువకుని బైక్ దగ్ధం చేసిన కేసులో 45రోజులౌతున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. జోన్‌కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, బాధితునికి న్యాయం జరిగే వరకు అన్ని దళిత సంఘాలతో పోరాడతామన్నారు. కార్యక్రమంలో భీమ్‌సేన వార్ ఉపాధ్యక్షులు దుర్గారావు, బాలకృష్ణ, స్థానిక నాయకులు శ్రీను, రవి, మహేష్, సుబ్బారావు, భాగం లక్ష్మి పాల్గొన్నారు.
ఎంపిపి సంఘీభావం..
దళితుల ఆందోళనకుఎంపిపి దంతులూరి వెంకట శివసూర్య నారాయణ రాజు సంఘీభావం తెలిపారు. బాధితునికి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే బాధిత దళితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామన్నారు.










