
ఉప్పలగుప్తం : వైసిపి ప్రభుత్వంలో నిలుపుదల చేసిన దళితుల 27 సంక్షేమ పథకాలను సిఎం జగన్ కొనసాగించాలని ఆర్‌పిఐ జాతీయ కార్యదర్శి డిబి.లోక్ డిమాండ్ చేశారు. గొల్లవిల్లిలో గురువారం ఆర్‌పిఐ కార్యకర్తల సమావేశాన్ని లోక్ నిర్వహించారు. జగన్ పాలనలో దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం దళితులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి జనసేనతో చేతులు కలిపి ఆ పార్టీ ఉనికిని పోగొట్టుకుందని జనసేన పార్టీకి నిర్ధిష్టమైన సిద్ధాంతాలు లేవని లోక్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో పెత్తందారీ పార్టీలకు సరైన బుద్ధి చెప్పే విధంగా దళిత వర్గాల్లో చైతన్యం తీసుకుని వచ్చి ఆర్‌పిఐని బలోపేతం చేస్తామని చెప్పారు.