ప్రజాశక్తి -పాయకరావుపేట:మండలంలోని పిఎల్ పురం గ్రామానికి చెందిన దళిత యువకుడు వడ్లమూరి నాగేంద్రను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని, హైకోర్ట్ జడ్జితో జ్యూడిషల్ విచారణ డిమాండ్ చేస్తూ శుక్రవారం దళిత బహుజన పార్టీ, ఎస్సీచ ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పాయకరావుపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక గౌతమి థియేటర్ నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ మాట్లాడుతూ, నాగేంద్రను హత్య చేసిన ప్రధాన నిందితులను అధికార పార్టీ అండదండలతో పోలీస్ యంత్రాంగం విచారణ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దువ్వాడ దావీదు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, పార్టీ పాయకరావుపేట టౌన్ అధ్యక్షులు జెక్కల సూరిబాబు, చిరుకూరి అర్జున్ రావు, ఐక్య వేదిక కన్వీనర్ తాటిపర్తి అప్పారావు యాదవ్, అధ్యక్షులు ఇలపు నాగబాబు, రెల్లి. వర్కింగ్ ప్రెసిడెంట్ మార్తి సింహాచలం, కార్యదర్శి గంటేటి చిట్టిబాబు, మాలమహానాడు అసెంబ్లీ ఇంచార్జ్ జయబాబు, స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్. పెదపాడటి. నూకరాజు, సైనిక్ దళ్ జిల్లా కెప్టెన్ బోడపాటి సురేష్, టౌన్ మహిళా అధ్యక్షురాలు బోడపాటి లక్ష్మి పాల్గొన్నారు.










