Sep 16,2023 19:13

వ్యకాస జిల్లా అధ్యక్షులు జార్జి
ప్రజాశక్తి - యలమంచిలి
ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే దళిత రక్షణ యాత్రను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి పిలుపు నిచ్చారు. శనివారం చించినాడ పెదపేటలో వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో సంతకాలు సేకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జార్జి మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ జరిగే రాష్ట్ర జాతాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు యడ్ల మోహనరావు, మాసవరపు సుబ్బారావు, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి కానేటి బాలరాజు, మండల నాయకులు గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, దిద్దే ఎసేపు పాల్గొన్నారు.