Jun 11,2023 22:52

ప్రజాశక్తి-కాకినాడ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జులైలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త దళిత రక్షణ యాత్రను జయప్రదం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపు ఇచ్చారు. కెవిపిస్‌ కాకినాడ జిల్లా మొదటి మహాసభలు జూన్‌ 10, 11 తేదీల్లో కాకినాడలో విజయవంతంగా జరిగాయి. ఈ సభల్లో ముఖ్యఅతిథిగా మాల్యాద్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకూ దళితుపై దాడులు, హత్యలు పెరిగిపోయాయన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దళిత రక్షణ యాత్రలు చేపట్టి సమస్యలపై చలో విజయ వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రల్లో దళితులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు, అభ్యుద యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ యాత్ర సన్నాహకంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఒంగోలులో కెవిపిస్‌ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఈ మహాసభలో కాకినాడ జిల్లా నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. 15 మందితో జిల్లా కమిటీ ఎన్నికయ్యింది. జిల్లా అధ్యక్షునిగా బి.సురేష్‌, కార్యదర్శిగా కె.సింహాచలం, ఉపాధ్యక్షులుగా కెఎస్‌.శ్రీనివాస్‌, జి.సత్యానందం, జిల్లా సహాయ కార్యదర్శులుగా కె.లోవరాజు, విప్పర్తి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులుగా పులపకూర గోపాలకష్ణ, ఎంజె.ఫ్రెడరిక్‌, ఏలేటి నానిబాబు, వి.చక్రధర్‌, ఎన్‌.రాజు, కన్నిడి వెంకటరమణ, గొల్లపల్లి చిన్ని, ఎం.శివశంకర్‌, కె.పద్మనాభం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.