Aug 25,2023 22:56

మాట్లాడుతున్న నటరాజ్‌

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికి దళిత సామాజిక, ఆర్థిక, సమస్యలు కేంద్ర, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం చాలా బాధాకరమని వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ కార్యదర్శులు కోట కళ్యాణ్‌, జి. నటరాజ్‌ దుయ్యబట్టారు. పట్టణంలోని టీచర్స్‌ కోపరేటివ్‌ భవన్‌లో శుక్రవారం కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి వెంకటరావు అధ్యక్షతన చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోనూ ఇప్పుడూ అధికారంలోకి వచ్చిన టిడిపి వైసిపిలు ప్రజలను మోసగిస్తూ వచ్చాయన్నారు. దళత ప్రజల అభివద్ధిని విస్మరించటం వలనే దళిత ప్రజల అబివద్ధి ఎజెండాగా కెవిపిఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంయుక్తగా, ''దళిత రక్షణ యాత్ర'' చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిని అన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉభయ రాష్ట్ర కమిటీలు రూపొందించిన చాట్రాఫ్‌ డిమాండ్లను చర్చించేందుకు చర్చాగోష్టి జరిగిందన్నారు.
ఈ చర్చాగోష్టి నిర్వహణకు గల కారణాలైన అంశాలను హాజరైన సంఘాల నాయకులకు వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోటా కళ్యాణ్‌ సంఘాల ఆమోదానికి ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసుల్లో 41 సిఆర్పిసి నోటిసు తీసుకోని దోషులను బెయిల్‌పై బయటకు పంపటాన్ని నిలిపివేయాలని, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలుచేయాలన్నారు. దళితులపై దాడులు జరిగిన సందర్భంలో ప్రభుత్వానికి తెలియజేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రకటించాలి. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అలుచేయాలి. దళితులకు 1235 జీవో ప్రకారం 2 ఎకరాల శ్మశాన భూమిని కేటాయించాలి. మౌలిక వసుతులు సమకూర్చాలి. భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కపాడాలి. ప్రైవేటు రంగంలో కూడ రిజర్వేషన్లు అమలు చేయాలి. సబ్‌ప్లాన్‌ చట్టానికి కాల పరిమితి తొలగించి, నిధులు దారిమళ్ళించకుండా కట్టుదిటం చేయాలి. దళిత, గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత కరంట్‌ను, ప్రాంతాలతో సంబంధం లేకుండా అమలుచేయాలని మొదలైన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సంఘాల నాయుకుల ఆమోదం కొరకు ప్రవేశ పెట్టారు. కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమళ్ళ అబ్రహాం పోరాట సాధన కమిటీకి కన్వీనర్‌గా, 15 మందితో కమిటీ వేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎ.శివాజీ, కోటా కష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, ఎస్‌.రామనాథం, కె.మధు, నాగేశ్వరరావు, ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.