Dec 11,2022 23:53

మాట్లాడుతున్న మౌనిక, తదితరులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:దళిత మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని రెల్లి హక్కుల సాధన కమిటీ జిల్లా మహిళా కార్యదర్శి యర్రంశెట్టి మౌనిక డిమాండ్‌ చేశారు. చెట్టుపల్లి గ్రామంలో విలేకర్లతో ఆమె ఆదివారం మాట్లాడుతూ, మహిళల రక్షణకు కఠిన చట్టాలు ఎన్ని ఉన్నా అవి సక్రంగా అమలు కాలేదని, అందుకే నేరాలు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం మహిళల రక్షణకు ఎన్నో కఠిన చట్టాలు, గృహహింస వరకట్నం, దిశా చట్టం, కాల్‌ సెంటర్లు ఉన్నప్పటికీ అవి అమలు చేయడంలో విఫలమవు తున్నాయని మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం ఎంతో పటిష్టంగా అమలు చేయాలన్నారు. మహిళల పోరాటాలతో చట్టాలు తీసుకు వస్తే వాటిని కొంతకాలానికే పరిమితం చేస్తున్నారన్నారు. కొందరి ఒత్తిడిల కారణంగా చట్టాలు చుట్టాలుగా మారుతున్నాjన్నారు. చట్టాలు కఠినంగా అమలు చేసినప్పుడు నేరాలు చేసే వారిలో భయం పుడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, కనక లక్ష్మీ, వరలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.