- రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు
ప్రజాశక్తి-సామర్లకోట
సామర్లకోట బలుసులపేటలో బుధవారం సాయంత్రం జరిగిన చర్చి గోడ కూలిన సంఘటనలో దుర్మరణం చెందిన కూలీలు పిట్టా అర్జునరావు (35), మచ్చా నాగేశ్వరరావు (శామ్యూల్ 35)ల మృతితో రెండు దళిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజు వారీ కూలీ చేసుకుంటే గాని గడవని వారి కుటుంబాలు ఈ సంఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఇంటికి సమీపంలోనే చర్చి నిర్మాణం పనులు చేపడుతుండగా ఈ సంఘటన జరగడంతో మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్ధలం నకు చేరుకుని కన్నీరు మున్నిరుగా విలపించారు. వారిని బంధువులు, స్ధానికులే చర్చి బీమ్ పిల్లర్ శిథిóలాల నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృతి చెందారు. మృతుడు పిట్టా అర్జునరావుకు భార్య సావిత్రి, అమ్మాయి సాత్విక (7), అబ్బాయి సంధ్యా కుమార్ (9)లు ఉన్నారు. హఠాత్తుగా కుటుంబానికి ఆధారమైన భర్తను, తండ్రి చనిపోవడంతో పిల్లలు, భార్య రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఇంటికి వస్తాడన ుకున్న నాన్న ఇక రాడు అనే విషయం తెలిసీ తెలియక వారు తీవ్రంగా రోదిస్తున్నారు.
అలాగే మరో మృతుడు మచ్చా నాగేశ్వరరావు భార్య కామేశ్వరి, ఇద్దరు ఆడపిల్లలు అపర్ణ ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసింది. రెండో కుమార్తే సంధ్య తొమ్మిదో తరగతి చదువుతుంది. నాగేశ్వరరావుది ప్రేమ వివాహం కాగా, కడవరకు తోడు ఉంటానని చెప్పి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయవా అంటూ భార్య రోదిస్తున్న తీరు హృదయాలను కలచివేస్తుంది. కుమార్తేలు ఇద్దరిని ఎంతైనా చదివిస్తామని చెప్పేవారని, మా కోసమే కష్టపడుతున్నానని చెప్పేవారని, ఇప్పుడు మా తండ్రి లేకపోతే మాకు ఎవరు దిక్కు అని చిన్నారులు ఇద్దరు కన్నీటి పర్యంతం అయ్యారు.వారిని చుట్టుపక్కల వారు బంధువులు సముదాయించినా వారు ఆగని పరిస్ధితి. అయితే చర్చి నిర్మాణం విషయంలో మున్సిపల్ అధి కారులకు నిర్వాహకులు పి.విజయకుమార్ ఎటు వంటి సమాచారం ఇవ్వలేనట్లు తెల్సింది. ఎటువంటి అను మతులు పొందకుండా ఎటువంటి పర్యవేక్షణ లేకుండా పనులు చేపడుతున్నారన్న ఆరోపణ లున్నాయి.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
కాగా మృతుల కుటుంబాలను పెద్దాపురం ఎంఎల్‌ఎఉ నిమ్మకాయల చినరాజప్ప, ఎపిస్టేట్ హౌసింగు బోర్డు చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు, పెద్దాపురం జనసేన పార్టీ ఇన్‌చార్జి తుమ్మల రామ స్వామి (బాబు), వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు,సీపీఎం నాయకులు కరణం ప్రసాదరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనువాసు, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ప్రకృతి ఈశ్వరరావు, పెనుపోతుల సత్తిబాబు, కోన రాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు అడబాల కుమాస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, రైతు నాయకుడు కంటే బాబు, టీడీపీ కౌన్సిలర్ బలుసు వాసు, జనసేన పట్టణ అధ్యక్షుడు సరోజా వాసు, పిట్టా జానకిరామారావు, మంచెం సాయి బాబు తదితరులు పరామర్శించారు. మృతుల కుటంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఎల్‌ఎ చినరాజప్ప, జనసేన్ ఇన్‌చార్జి తుమ్మల బాబులు డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరపున పోరాటం చేస్తామన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన చర్చి నిర్వాహకులు కూడా మృతుల కుటుబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయ పడిన మూడో కార్మికుడు ఎడగల అబ్రహాం పరిస్ధితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతులు, క్షత గాత్రుడి కుటుంబీకులను పరామర్శించి పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, ఎపి స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దవులూరి దొరబాబులు ధైర్యం చెప్పారు. కేసును సామర్లకోట సిఐ కె దురా ్గప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూలిన చర్చిగోడ ..... మృతులు పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావు ( ఫైల్ ఫోటోలు)










