ప్రజాశక్తి-పిఠాపురం కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితుల హక్కులు సామాజిక న్యాయంపై ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని బుధవారం మంగితుర్తి గ్రామంలో సంతకాలు సేకరణ చేపట్టారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తి చేసుకున్నా కుల వివక్ష అనేక రూపాల్లో విలయతాండవం చేస్తోందన్నారు. దళితుల చట్టాలను నీర్చగార్చే విధానాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని కాబట్టి దీనికి వ్యతిరేకంగా దళితులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమించి దళిత చట్టాలను కాపాడుకోలన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిపర్సులు అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెక్కల లాజరు, బండి నూకరాజు, డెక్కల జగ్గారావు, మేడపాటి చంటిబాబు, కె.కామరాజు పాల్గొన్నారు.










