దళిత, గిరిజనులకు భూ పంపిణీ చేయాలి
ప్రజాశక్తి-కావలి(అల్లూరు) : దళిత, గిరిజనులకు తక్షణమే భూమి పంపిణీ చేయాలని వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం అల్లూరులోని దళిత, గిరిజనులు దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని జిఒ నెంబర్ 54 ప్రకారం వారికి భూమి పంపిణీ చేయాలని తెలియజేశారు. జగనన్న ఆశయం దెబ్బతినకుండా అధికారులు భూమి పంపిణీ చేయాలని కోరారు. అల్లూరు మండలం ఆములూరు గ్రామంలో 363 సర్వే నెంబర్లు వందల ఎకరాల గ్రావెల్‌ను తొవ్వుకొని సర్వనాశనం చేసిన సుకుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాజుపాలెం చెందిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలని కోరారు. అలాగే ఇసుకపల్లి, గద్దగుంట గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకొని అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా గ్రావెల్ ఎత్తి సొమ్ము చేసుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మనోజ్, సత్యవతమ్మ, జయప్రకాష్, దినేష్, సుసన్న, తదితరులు పాల్గొన్నారు.










