
ప్రజాశక్తి - బాపట్ల రూరల్
దివ్యాంగులు తమ ఓట్లు సరిచూసుకోవాలనీ బాపట్ల జనసేన దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులు తమ ఓట్లను స్థానిక తహశీల్దారు కార్యాలయం, సచివాలయంలో పరిశీలించుకావాలని సూచించారు. ఒట్లు లేని ఎడల వెంటనే చేర్చుకొని 2024లో జరగబోవు సాధారణ ఎన్నికలలో దివ్యాంగుల ఓట్లను బలమైన శక్తిగా చేసుకోవాలన్నారు. మన ఓట్లతో గెలిచి మనల్ని గుర్తించని ప్రభుత్వానికి మన ఓటుతో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవరెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు పాల్గొన్నారు.