
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: మండలస్థాయిలో గ్రిగ్స్ పోటీలకు జట్లు ఎంపికను శనివారం నగరంపల్లిలో నిర్వహించారు. బాలుర వాలీబాల్ విభాగంలో సీనియర్స్ నుండి ఎంజెపి రెసిడెన్షియల్ స్కూల్ అక్కుపల్లి, పాతటెక్కలి ఉన్నత పాఠశాల, జూనియర్స్ నుండి ఎంజెపి రెసిడెన్షియల్ స్కూల్ అక్కుపల్లి, బాతుపురం ఉన్నత పాఠశాల జట్లు ఎంపికయ్యాయి. అలాగే బాలికల వాలీబాల్ సీనియర్ విభాగంలో డోకులపాడు, బాతుపురం ఉన్నత పాఠశాల జట్లు, జూనియర్స్ బాతుపురం, డోకులపాడు ఉన్నత పాఠశాల జట్లు ఎంపికయ్యాయి. అలాగే బాలుర ఖోఖో పోటీలకు సీనియర్స్ నుండి నగరంపల్లి ఉన్నత పాఠశాల, పూండి సాయి వినీత స్కూల్ జట్లు, బాలుర జూనియర్స్‌లో నగరంపల్లి, పిఎం పురం ఉన్నత పాఠశాల జట్లు ఎంపికయ్యాయి. అదే విధంగా బాలికల ఖోఖో పోటీలకు సీనియర్స్ నుండి నగరంపల్లి, దేవునల్తాడ ఉన్నత పాఠశాల జట్లు, బాలికల జూనియర్స్ నుండి నగరంపల్లి, అమలపాడు ఉన్నత పాఠశాల జట్లు ఎంపికయ్యారు. ఈ జట్లు కంచిలి మండలం ఎంఎస్ పల్లిలో జరిగే డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో ఎంఇఒ దశరధరావు, రాష్ట్ర పిఇటి సంఘం కార్యదర్శి తవిటయ్య, జోన్ 1 కార్యదర్శి పైల గజేంద్ర, ఎంఎస్‌ఒ చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు రామ్, జి. హరినాధ్, లోకేష్ పాల్గొన్నారు.