ప్రజాశక్తి బల్లికురవ రూరల్, సంతమాగులూరు
బల్లికురవ, సంతమాగులూరు మండలాల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ కృష్ణకు డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పదోన్నత లభించింది. పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే పోస్టింగ్ ఉత్తర్వులు అందుతాయని ఎంపిడిఒ తెలిపారు. పదోన్నతి లభించడంతో పలువురు రాజకీయ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు అభినందించారు.










