Nov 09,2023 18:58

రక్తదానం చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :నగర పరిధిలోని స్థానిక 15వ డివిజన్‌ బాలాజీ నగర్‌ సెంటర్లో డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఆ సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి ప్రభు త్వ వైద్య కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాలేషా భాషా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ,ఉపాధి సమస్యలపై యువతను చైతన్యపరుస్తుందన్నారు. సమస్యల పైన కార్య క్రమాలు చేస్తూ,మరోవైపు సేవా కార్యక్రమాల వైపు యువతను నడిపిస్తూ మంచి మార్గాల వైపు నడి పిస్తున్న సంఘం డివైఎఫ్‌ఐ అని కొనియాడారు. ఇటీవల యువత చెడు వ్యసనాలకు బాని సలై తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత డివై ఎఫ్‌ఐ సంఘం పైన ఉన్నదని తెలిపారు. జిల్లాలో కరోనా సమయంలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు కషి చేశారని తెలిపారు. గతంలో కోవూరు, వెంకటేశ్వరపురం వరదలతో మునిగినప్పుడు డివైఎఫ్‌ఐ భోజనాలు వండి అందించినట్లు తెలిపారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీపీ నరసింహ, ఎంవి రమణ లు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యువత తమవంతుగా డివైఎఫ్‌ఐ సంఘాలతో కలిసి ప్రతి వార్డులో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 15వ డివిజన్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జగదీష్‌, బాబు, 15వ డివిజన్‌ మాజీ నాయకులు అల్లంపాటి శ్రీనివాస్‌ రెడ్డి, డివైఎఫ్‌ఐ నగర నాయ కులు కుమార్‌, నాని సిఐటియు నాయకులు జి నాగేశ్వరరావు, టీవీ వి ప్రసాద్‌ మహిళా సంఘం నాయకులు మస్తాన్‌ బి,పద్మ,సుబ్బమ్మ, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌ ఉన్నారు.