Dec 23,2022 23:17

ప్రజాశక్తి-నందిగామ 

క్రీస్మస్‌ పండుగ పురస్కరిం చుకుని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నందిగామలో 5కె రన్‌ నిర్వహించారు. నందిగామ ఎసిపి జి.నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని 5కె రన్‌ ను డివైఎఫ్‌ఐ జెండాను ఊపి ప్రారంభించారు. 5 కె రన్‌ కు క్రీడాకారుల నుండి మంచి స్పందన లభించింది. ఎసిపి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ యువత మాదక మత్తు పదర్ధాలకు అలవాటు పడకుండా క్రీడల వైపు ఆసక్తి చూపాలని కోరారు. నందిగామ ఎసిపి కార్యాలయం నుండి మాగల్లు శ్రీ విద్యా పాఠశాల వరకు మధిర రహదారి పై 5 కి.మీ.వరకు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని 5 కె రన్‌ చేశారు. విజేతలకు నందిగామ గాంధీ సెంటర్లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న, ఎన్టిఆర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌. నాగేశ్వరరావు, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి జక్కులూరి రవి, యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు పిఎస్‌ హరనాధరెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు,సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టిఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయిక్‌, సయ్యద్‌ ఖాసిం, లాల్‌ సలామ్‌, ప్రజాసంఘాల నాయకులు ఎం.శ్రీనివాసరావు, జర్నలిస్టుల సంక్షేమ యూనియన్‌ నాయకులు ఎ.వి.నారాయణ, పిఇటిలు గురునాధం, ఎసోబు, హుస్సేన్‌, శ్రీనివాసరావు,సూర్యం, ఎన్సిసి క్యాడెట్లు, ఎఎన్‌ఎం,అంబులెన్స్‌ సిబ్బంది క్రీడాకారులకు సేవలందించారు