
ప్రజాశక్తి- పోలాకి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ సీతారాం సూచించారు. బుధవారం సంత లక్స్మీపురం గ్రామంలో చైర్మన్ కరిమి రాజేశ్వరరావు ఆదేశంతో రైతులకు, పొదుపు మహిళా సంఘాల సభ్యులకు, చిరు వ్యాపారులకు బ్యాంకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా నరసన్నపేట శాఖ మేనేజర్ ఇప్పిలి సీతారాం మాట్లాడుతూ తమ బ్యాంక్ అందించే సేవలపై వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పోల్చితే తమ బ్యాంక్ తక్కువ వడ్డీలకే రుణ సౌకర్యం, ఆలాగే ఫిక్స్డ్ డిపాజట్లపై అధిక వడ్డీ చెల్లిస్తామన్నారు. అసిస్టెంట్ మేనేజర్ యోగేశ్వరి మాట్లాడుతూ చిల్లర వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేలు రుణ సౌకర్యం కల్పించగలమని, అన్ని రకాల డిజిటల్ లావాదేవీల సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డిజిఎం బసవలింగం, సర్పంచ్ యారబాటి నీలవేణీ రమణ, సొసైటీ సిఇఒ రాంబాబు, సొసైటీ సిబ్బంది నాగరాజు, భాస్కరరావు, పవన్ కుమార్ పాల్గొన్నారు.