పేపర్ మిల్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారంటూ కలెక్టర్‌కు ఎఐటియుసి ఫిర్యాదు
ప్రజాశక్తి - కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహ రిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (డిసిఎల్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంటనే బదిలీ చేయాలని అతని అక్రమాలపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎఐటియుసి జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కె.బాడకొండ తదితర నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు
ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఆంధ్ర పేపర్ మిల్ పాత గుర్తింపు సంఘం కాల పరిమితి 2019 డిసెంబర్‌తో ముగిసి పోయింద న్నారు. కాకినాడ డీసీఎల్ 2020 ఫిబ్రవరి లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభిం చారని మధు అన్నారు. ఓటర్ లిస్టు కూడా జారీ చేశారని అయితే కోవిడ్ కారణంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందన్నారు. ఈ సందర్భంగా పాత గుర్తింపు సంఘం హైకోర్టులో ఎన్నికల నిలుపుదల కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోయినా దాదాపు మూడు సంవత్సరాలు జిల్లా కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యానికి పాత గుర్తింపు సంఘానికి వత్తాసు పలుకుతున్నారని మధు కలెక్టర్ వివరించారు. కోర్టులో కేసు వేసిన సంఘమే 2023 మార్చి నెలలో కేసు విత్ డ్రా చేసుకున్న యాజమాన్యానికి తొత్తుగా ఉన్న డిసిఎల్ ఎన్నికలు జరుపకుండా ఏదో కుంటి సాకుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎనిమిది కార్మిక సంఘాలు పలుమార్లు కాకినాడ డిసిఎల్ కార్యాలయంలో సమావేశంలో కూర్చున్న ఏదో వంకతో వాయిదా వేస్తున్నారని డిసిఎల్ వైఖరి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఉందని మధు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలో పనిచేస్తున్న డిసిఎల్ కాబట్టి ముందుగా ఆమెకు వినతిపత్రం ఇస్తున్నామని, అనంతరం కార్మిక శాఖ కమిషనర్ కలిసి ఆందోళన చేపడతామని మధు తెలిపారు
జిల్లా కలెక్టర్ ఆగ్రహం...
మధు చెప్పిన విషయాన్ని పూర్తిగా విన్న జిల్లా కలెక్టర్ డిసిఎల్ ను పిలవగానే ఆయన రాకపోవడంతో ఎసిఎల్ వచ్చారు. ఏరి మీ డిసిఎల్ అని అడిగితే ఆమె బదులిస్తూ కోర్టుకెళ్లారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యి సాయంత్రం కల్లా నా ఛాంబర్‌కి రావాలని పేపర్‌మిల్ విషయం చర్చించాలని లేకుంటే మెమో జారీ చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
స్పందనలో డిసిఎల్ మీద ఫిర్యాదు చేస్తున్న తాటిపాక మధు










