Oct 09,2023 20:49

ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెద్దకడబూరు
డిసెంబర్‌ ఆఖరి వరకు ఎల్‌ఎల్‌సికి సాగునీరందించాలని సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతుసంఘం నాయకులు పరమేష్‌, సిఐటియు నాయకులు ఈరన్న డిమాండ్‌ చేశారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌ వీరేంద్ర గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దకడబూరును కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు మంజూరు చేయాలని, ఆర్‌డిఎస్‌ కుడి కాలువకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. చిన్నతుంబలం హనుమంతు పాల్గొన్నారు.