Oct 02,2023 21:27

సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష పార్టీల నాయకులు

 కడప అర్బన్‌ : సామాజిక హక్కులు, ఆర్థిక భూమి సమస్యలు 21 డిమాండ్ల పరిష్కారం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోటి సంతకాలతో విజ్ఞాపన పత్రం ఇవ్వడంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రం జ్యోతిరావు పూలే సర్కిల్లో సంతకాల సేకరణను ప్రజా సంఘాల నాయకులు ప్రారం భించారు. ఈ సందర్భంగా భూపోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ బి.నారాయణ, రాయలసీమ మాల మహానాడు హ్యూమన్‌ రైట్‌ జిల్లా కన్వీనర్‌ జె,వి రమణ, కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ ఫోరం నాయ కులు అలీ ఖాన్‌ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు, అత్యా చారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. మణిపూర్‌ లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేయటం యావత్‌ భారతదేశాన్ని తలదించుకునేలా చేసిందని తెలిపారు. ఇంత జరిగినా మతోన్మాద ప్రధానమంత్రి మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు. దాడులు చేసిన వారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసిందని రిజర్వే షన్లను అమలు జరపకుండా అనేక ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. మనువాద భావజాలాన్ని అమలు జరిపి లౌకిక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దళితుల హక్కు లను పాలక పక్షాలు హరించి వేస్తున్నాయని తెలి పారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్‌ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.శివకుమార్‌, వి. అన్వేష్‌ మాట్లాడుతూ దళిత హక్కులు సామాజిక ఆర్థిక భూమి సమస్యల పరిష్కారం కోసంతో పాటు 21 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఉద్యమం చేపడుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలో ప్రారంభించిన సంతకాల సేకరణ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో కొనసాగించి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతి కి అంద జేయ ను ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఐ.యన్‌. సుబ్బమ్మ, బిసి మహాసభ జిల్లా నాయకులు అవ్వారు మల్లికార్జున, బిఎస్‌పి జిల్లా నాయకులు గుర్రప్ప, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్‌.వి ప్రసాద్‌, ఎరుకుల హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, రిపబ్లిక్‌ పార్టీ నాయకులు నర్సింహులు, ఆర్‌ఎస్‌పి సుబ్బరాయుడు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నాయకులు జైవర్ధన్‌, జై భారత్‌ జై. స్వరాజ్యం పార్టీ నాయకులు సంగటి మనోహర్‌, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు పాపిరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు రెడ్డి, మనోహర్‌, నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, శ్రామిక మహిళ సంఘం నాయకురాలు రాజమణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, ఐఓసీ కార్మిక సంఘం నాయ కులు వీరారెడ్డి, శ్రీనివాసులు, హైకోర్టు అడ్వకేట్‌ అమీన్‌, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మాజీ నాయకులు నారాయణరెడ్డి, లోక్‌ సత్తా పార్టీ దేవర కష్ణ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మాజీ జిల్లా కార్యదర్శి జితేంద్ర పాల్గొన్నారు.