
ప్రజాశక్తి - నందిగామ : ఎన్టీఆర్ జిల్లా దిశా మహిళా కమిటీ సభ్యురాలుగా నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది కురగంటి ప్రవీణని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం, పరిహారం చట్టం 2013, సెక్షన్ 29 ప్రకారం చట్టం అమలు నియమాలు ఎక్కడ అయితే మహిళా ఉద్యోగులు మహిళా పని వారు పని చేస్తారో సంబంధిత సంస్థలు నడుపు వారితో అనగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికారులకు ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు మరిన్ని రకాల ప్రైవేట్ సంస్థల సదరు చట్టాన్ని అనుసరించి ప్రతి యజమాని రాతపూర్వక ఆర్డర్ ద్వారా అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో నందిగామ బార్ అసోసియేషన్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది అయిన కురగంటి ప్రవీణను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో కాపీని ఎన్టీఆర్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాంబాబు ప్రవీణాకి అందజేశారు. సీనియర్ న్యాయవాది ప్రవీణ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని మహిళలు అందరికీ అండగా ఉంటానన్నారు. తన నియామకానికి కృషిచేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.