అవగాహన కల్పిస్తున్న సిఐ జీడిబాబు
ప్రజాశక్తి-అరకులోయరూరల్:మండలంలోని కొత్త బల్లుగుడ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో సిఐ జీడి బాబు, ఎస్‌ఐ సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం మీ కోసం మీ పోలీసు కార్యక్రమంలో భాగంగా దిశా యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ దిశ యాప్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించా లన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం, సిబ్బంది, కానిస్టేబుల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.










