Sep 26,2022 00:01

కోలగట్లను సత్కరిస్తున్న కాయల వెంకటరెడ్డి తదితరులు

ప్రజాశక్తి -యంత్రాంగం
ఎపి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి విజయనగరం వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామికి మార్గ మధ్యంలో ఆదివారం అపూర్వ స్వాగతం లభించింది.
తగరపువలస : మోదవలస వద్ద స్థానిక వైసిపి నాయకులు, అతని అభిమానులు కోలగట్లకు స్వాగతం పలికారు. పూల మాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, సింగనబంద సర్పంచ్‌ గాడు వెంకట నారాయణ, ఎంపిటిసి సభ్యులు తుపాకుల పైడిరాజు, నాయకులు గాడు శ్రీను తదితరులు ఉన్నారు.
సీతమ్మధార : డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి విశాఖలో మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆనందపురం హైవే వద్ద అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సత్కరించారు. ఉత్తరాంధ్ర వాసి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరంగా ఉందని, రానున్న కాలంలో మరిన్ని పదవులు అలంకరించాలని కాయల వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాయల సూరారెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.