డిప్యూటీ సిఎం రాజన్నదొరను సన్మానిస్తున్న ఆర్‌పిలు
సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొరను జిల్లా వెలుగు ఉద్యోగులు, అధికా రులు సోమవారం సన్మానించారు. ఆయన నివాసంలో కలిసిన అనంతరం వెలుగు ఉద్యోగులకు 23శాతం జీతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వారు ధన్యవాదాలు తెలిపారు. రాజన్నదొరకు దుశ్శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డిపిఎం అప్పారావు, ఎపిఎంలు సింహాచలం, సత్యనారాయణ, సన్నిబాబు, జయకుమార్, భారతి, త్రినాధమ్మ పాల్గొన్నారు.










