Aug 02,2023 21:31

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ సత్యనారాయణ

 రాయచోటి : జిల్లాలో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ నెల 3న ఒక షిఫ్టుల్లో మదనపల్లె విశ్వం ఇంజినీరింగ్‌ కళాశాలలో అంగళ్ల వద్ద డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సత్య నారాయణ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌ డిఆర్‌ఒ ఛాంబర్‌లో ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగుల పరీక్షల నిర్వహణపై బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ శాఖపరమైన పరీక్షలకు జిల్లాలో 115 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు జారీ చేశారని చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. ఒక షిఫ్ట్‌లో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఆబ్జెక్టివ్‌ విధానంలో10 నుంచి 12 వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. . పరీక్షా కేంద్రంలోకి సెల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గడ్జస్‌ అనుమతించరని పేర్కొన్నారు. ఆయా పరీక్షలకు కమిషనర్‌ వారు నిర్దేశించిన బుక్స్‌ను మాత్రమే అనుమతిస్తారని, సెల్‌ ఫోన్లు తీసుకుని పరీక్షా కేంద్రంలోకి వచ్చిన వారిని గుర్తిస్తే మాల్‌ ప్రాక్టీస్‌ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9:30 లోపు హాజరు కావాలని, ఆలస్యమైతే అనుమతించరని చెప్పారు. హాల్‌ టిక్కెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్‌ తప్పనిసరిని తెలిపారు. పోలీస్‌ బందోబస్తు, మెడికల్‌ క్యాంపు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, తాగునీటి వసతి తదితర అంశాలపై ప్రత్యేక దష్టి పెట్టి పరీక్షలు సజావుగా నిర్వహించడానికి శాఖల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యమని స్పష్టం చేశారు. సమీక్షలో ఎపిపిఎస్‌సి అన్నమయ్య జిల్లా పర్యవేక్షణ అధికారి ఎస్‌.ఖాసీంవలి, కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, పోలీస్‌, ప్రజా రవాణా, మెడికల్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.