ప్రజాశక్తి-కరాస : డిమాండ్లను సత్వరమే నెరవేర్చాలని కోరుతూ ఆల్ పెన్సనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిఎఫ్ రీజనల్ కార్యాలయం వద్ద సోమవారం ఇపిఎఫ్ 95 పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీటీ మూర్తి మాట్లాడుతూ, కోర్టు తీర్పును అమలు చేయాలని, పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్, రూ.తొమ్మిది వేలు కరువుభత్యం, భార్యాభర్తలకు వైద్య సదుపాయం, 2014 ముందు, తర్వాతన్న క్లాసులు రద్దు, హయ్యర్ పెన్షన్ పొందుతున్న వారికి నిలుపుదల చేసిన ఇపిఎఫ్ చెల్లింపు తదితరసమస్యలను పరిష్కరించాలని కోరారు.. అనంతరం పిఎఫ్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.కార్యక్రమంలో యువిఎస్‌ఎన్ వర్మ , జిల్లా కార్యదర్శి జె.కోటేశ్వరరావు, కె.సూర్యచంద్రరావు, కె నూకరాజు, పి భాస్కరరావు, శ్రీనివాసమూర్తి, తులసిరావు, జి సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు.










