Oct 10,2023 23:07

ప్రజాశక్తి-అమలాపురం
రాష్ట్ర పిలుపులో భాగంగా ఎి వెలుగు విఒఎ(యానిమేటర్స్‌ ) ఉద్యోగుల సంఘం( సిఐటియు )
ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వంటావార్పు చేశారు. అనంతరం డిఆర్‌ఒకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాని ఉద్దేశించి పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శులు కష్ణవేణి, నూకల బలరాం, విఒఎ సంఘ జిల్లా అధ్యక్షులు ఎ. జ్యోతి, ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి మాట్లాడుతూ విఒఎల మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్‌ రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, విఒఎల మెర్జ్‌ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విఒఎ లను మెర్జ్‌ చేయడం వలన వేలాదిమంది విఒఎలకు ఉపాధి పోతుందని ఇది మానవ వనరులకు విఘాతం కలిగించడమే అని అన్నారు. ఎక్కువ సంఘాలు ఉన్న వి ఒఎల నుంచి తక్కువ సంఘాలు ఉన్న విఒఎలకు సర్దుబాటు చేయాలని ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. 15 సంఘాల లోపు ఉన్న విఒఎల జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. వారికి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కోల్పోయిన విఒఎలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలన్నారు. జెండర్‌, వయస్సు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలి అన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధతం చేస్తామని అన్నారు. ధర్నాలో అంగన్‌వాడీి జిల్లా నాయకులు వెంకటలక్ష్మి, ఆశ నాయకులు భువనేశ్వరి, విఒఎ జిల్లా నాయకులు సంతోషి, వరమ్మ, నాని బాబు, జ్యోతి, సుబ్బలక్ష్మి, సూర్యకాంతం, రాగదేవి, లక్ష్మి, శ్యామల, మీరాబాయి, విఒఎలు పాల్గొన్నారు
.