ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : మండలంలోని డికెపట్నంలో జనసేన మండల అధ్యక్షులు మణి ఆధ్వర్యాన గ్రామ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు హాజరై, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ప్రధానంగా రోడ్డు, తాగునీరు, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు జనసేన నాయకులు హామీ ఇచ్చారు. డికెపట్నం నుండి బొడ్డవలస, టొంకి, గోచక్క గ్రామాలలో కాలినడకన ర్యాలీగా వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బలిజిపేట మండల అధ్యక్షులు బి.పోలినాయుడు, జిల్లా నాయకులు కె.విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, కర్రి మణికంఠ, అల్లు రమేష్, సతీష్, పైల రాజు, గుంట్రెడ్డి గౌరీశంకర్, పాత్ర పవన్, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, ఎ.దుర్గాప్రసాద్, సి సంతోష్, దుర్గా, కనకరాజు, పి.ప్రదీప్, కృపారావు, కేశవరావు, మహేష్, శివసాయి, తదితరులు పాల్గొన్నారు.










