మాట్లాడతున్న ఎంపిడిఒ చంద్రశేఖర్
ప్రజాశక్తి-కోటవురట్ల:సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు డిజిటల్ సర్వీసెస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన డిజిటల్ సర్వీసెస్ పట్ల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఏపీ సేవా సర్వీసెస్‌లో ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, మ్యుటిషన్ సహా ఆధార్ అప్డేట్ వంటి అంశాల పట్ల సిబ్బందికి అవగాహన కల్పించారు. అందు బాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిం చాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యద ర్శులు, డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










