బద్వేలు పట్టణంలో అద్దె భవనంలో ఉన్న లైబ్రరీకి సొంత భవనం మంజూరు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా డిజి టల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని గురువారం డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లా డుతూ పట్టణంలో గ్రంథాలయం అద్దె భవనంలో నడుస్తుందని సరైన సదుపాయాలు లేక పాఠకులు అనేక ఇబ్బందులు పడు తున్నారని పేర్కొన్నారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్నాయని, వాటిలో లైబ్రరీకి సొంత స్థలం కేటాయించి డిజిటల్ లైబ్రరీ ఏర్పా టు చేయాలని విన్నవించారు. లైబ్రరీలో గ్రూప్-1, 2 ,3,4, ఎస్‌ఐ కానిస్టేబుల్ వంటి పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధి కారులతో చర్చించి అనువైన ప్రదేశంలో అన్ని వసతులతో కూడిన లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు కషి చేస్తానని హామీ ఇచ్చారు.










