Sep 30,2023 20:23

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి
డిజిటల్‌ క్లాస్‌ రూంలు ఏర్పాటు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:ఆత్మకూరు నియోజకవర్గంలో రానున్న రోజులలో ఆత్మకూరు డెవలప్‌ మెంట్‌ ఫోరం ద్వారా 100 పాఠశాల్లలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ లు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డాక్టర్‌ గుండాల సూర్య నారాయణరెడ్డి సహకారంతో ఆత్మకూరు డెవలప్‌ మెంట్‌ ఫోరం, సీడ్స్‌ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
అంతకు ముందు డిజిటల్‌ క్లాస్‌ రూం ఏర్పాటు కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా నిల్చున్న విద్యార్థులను ఎమ్మెల్యే విక్రమ్‌ రెడ్డి పలుకరిస్తూ ముందుకు సాగారు.అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంల పని తీరు గురించి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి వీక్షించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అర్థమయ్యే విధంగా దశ్యరూపంలో డిజిటల్‌ క్లాస్‌ రూంలు పనిచేసే విధానంపై అందరికి వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరుకు చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి, అమెరికాలో ఉంటున్న డాక్టర్‌ గుండాల సూర్య నారాణరెడ్డి సహకారంతో ఆత్మకూరు డెవలప్‌ మెంట్‌ ఫోరం, సీడ్స్‌ సంస్థలతో కలసి రెండు డిజిటల్‌ క్లాస్‌ రూంలు ఏర్పాటు చేయడం నందంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఐఏఎస్‌ అధికారి సీడ్స్‌ సమస్త అధినేత రామిరెడ్డి చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ కేత వేణుగోపాల్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వెంకట రమణమ్మ , ఎంఇఒలు నజీర్‌ బాషా, చలపతిరావు, పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు మధుసూదన్‌ రావు, విద్యా కమిటీ చైర్మన్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.