మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి
డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభం
ప్రజాశక్తి-అనంతసాగరం:రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక విద్యాభివద్ది కోసం పలు పథకాల ద్వారా రూ.లక్ష కోట్లు అందచేశారని, అలాంటి ముఖ్యమంత్రి బాటలో నడుస్తూ ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా దాతల సహాయ సహకారాలతో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
శనివారం ఆయన మండల కేంద్రం లోని టిజెఎన్ ఉన్నత పాఠశాలలో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా చింతగుంట చెన్నారెడ్డి, రాజమ్మ దంపతుల గౌరవార్ధం వారి కుమారుడు చింతగుంట సుబ్బారెడ్డి, అనితల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను ఆయన ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పోటి ప్రపంచంలో విద్యార్థులకు మరింత అర్థమయ్యే రీతిలో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఏడీఎఫ్ ద్వారా ఆమెరికాలో నివాసముంటున్న చింతగుంట సుబ్బారెడ్డి, అనితలు అందచేయడం జరిగిందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో 100 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.










