Sep 20,2023 21:46

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
             వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డిజె, తీన్మార్లకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌ అన్నారు. వినాయక నిమజ్జనాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏలూరు కాలువ రేవు ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగేలా తీన్మార్‌, డిజె ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేయరాదన్నారు. ఆయన వెంట డిఎస్‌పి శరత్‌రాజ్‌ కుమార్‌, పట్టణ సిఐ నాగరాజు ఉన్నారు.
    పెనుగొండ :మండలంలోని సిద్ధాంతంలో వినాయక నిమజ్జనం జరిగే రేవుల వద్ద భద్రత ఏర్పాట్లను ఎస్‌పి రవిప్రకాష్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజెలకు, తీన్‌మార్లకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఊరేగింపులు జరుపుకోవాలన్నారు.