భెల్ మెయిన్ గేట్ వద్ద సిఐటియు నిరసన
ప్రజాశక్తి -గాజువాక : దీపావళి పండగలోపే స్పెషల్ ఇన్సెంటివ్ చెల్లించాలని మంగళవారం భెల్ మెయిన్ గేటు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు . ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కె విజరుకుమార్ మాట్లాడుతూ, యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు పెద్దఎత్తున నిరసన చేపట్టనున్నట్లు వెల్లడింఆచరు.. సిఐటియు ప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్ మాట్లాడుతూ, రూ.400 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, భెల్ యాజమాన్యం బోనస్ ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలనే భెల్ యజమాన్యం వ్యవహరించడం దారుణమన్నారు. జాతీయస్థాయి జాయింట్ చర్చల కమిటీ పునరుద్ధరించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయకపోవడం, భెల్ యాజమాన్యం అనుసరిస్తున్న, ఏకపక్ష ధోరణి నిదర్శనమన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను భెల్ యాజమాన్యం విడనాడాలని, కష్టించి పనిచేసే కార్మికులకు ఆనవాయితీగా ఇస్తున్న స్పెషల్ ఇన్సెంటివ్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనాను సాకుగా చూపి కార్మికులకు అన్యాయం చేయొద్దన్నారు. కార్యక్రమంలో సనపల జగన్నాధరావు, ఎస్ అప్పారావు, పవన్, నారాయణ, వెంకటరాావు, జనార్ధన్, శివరాం పాల్గొన్నారు.










